గురజాల నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం ఉదయం 5గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కారణంగా 30వ తేదీనే పెన్షన్ ను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.