పిడుగురాళ్ల పట్టణంలోని విత్తన దుకాణదారులకు మండల వ్యవసాయ అధికారి సంధ్యారాణి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఎమ్మార్పీ ధరలకు మాత్రమే ప్రత్తి విత్తనాలు అమ్మకం జరపాలని, బిటి-3 ప్రత్తి విత్తనాలు అమ్మిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని విత్తన డీలర్ల అందరికీ సూచనలు ఇచ్చారు. డీలర్లు అందరూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలన్నారు.