పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ అగ్ని మాపక కేంద్రంలో సోమవారం అగ్ని మాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమరవీరులకు నివాళులు అర్పించి, అవగాహన పెంపునకు కరపత్రాలు, గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం కోటేశ్వరనాయక్, రాజా, డాక్టర్లు శ్రీనివాసరావు, మూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.