మహాత్మ పూలే జయంతి సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమాఖ్య పల్నాడు జిల్లా అధ్యక్షుడు వంగూరి అశోక్ కుమార్ ఘన నివాళిలర్పించారు. మహాత్మ పూలే శూద్రులు, పంచముల అభివృద్ధికి, మహిళా విద్యకు పునాది వేసిన గొప్ప సంఘసంస్కర్తని అన్నారు. అంటరానితన నిర్మూలన కోసం జీవితాంతం పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పిడుగురాళ్ల ఆర్&బి బంగ్లా వద్ద శుక్రవారం ఉదయం నిర్వహించారు.