పిడుగురాళ్లలో ఈనెల 15న మన్యం పుల్లారెడ్డి పాఠశాల, వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగే ప్రజావేదిక ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరిశీలించారు. వేలాది మంది ప్రజలు హాజరయ్యే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.