పిడుగురాళ్ల: రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీఆర్

55చూసినవారు
పిడుగురాళ్ల: రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీఆర్
రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పిడుగురాళ్ల పట్టణ టీడీపీ కార్యాలయంలో శనివారం నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చిన ఘనత ఎన్టి రామారావుకే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్