పిడుగురాళ్ల: చికెన్, మటన్ షాపులపై అధికారులు తనిఖీలు

104చూసినవారు
పిడుగురాళ్ల పట్టణంలోని చికెన్ మటన్ షాపులపై ఆదివారం తూనికల కొలతల శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని హై స్కూల్ కాంప్లెక్స్ లోని మటన్ చికెన్ షాప్ ల కాటాలను అధికారులు పరిశీలించగా కాటాలలో వ్యత్యాసాలను గుర్తించారు. వినియోగదారులను మోసం చేస్తున్న మటన్ చికెన్ షాపుల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్