మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతిని పిడుగురాళ్ల ఆర్ అండ్ బి బంగ్లా సెంటర్ లో వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, నవభారత నిర్మాణానికి నాంది పలికిన మహాత్ముడు పూలే. ఆశయాలను వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తోందని పేర్కొన్నారు.