రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. పిడుగురాళ్ల పట్టణంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్స్ఫర్డ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.