దాచేపల్లి, నారాయణపురం, నడికుడి, ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిధిలో ఈనెల 11న శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భగవాన్ తెలిపారు. సబ్ స్టేషన్, ట్రాన్స్ పార్మర్, లైన్ల మరమ్మతుల కారణంగా ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.