పిడుగురాళ్ల మండలం కామేపల్లి సమీపంలోని మెడికల్ కాలేజీ హైవే వద్ద సోమవారం సాయంత్రం ప్రమాదం జరిగింది. వినాయక దేవాలయం సమీపంలో ఓ కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అతడిని వెంటనే పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.