పిడుగురాళ్లలో దొంగల హల్చల్

58చూసినవారు
పిడుగురాళ్లలో దొంగల హల్చల్
పిడుగురాళ్ల పట్టణంలో మంగళవారం దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని చెరువు కట్ట రహదారిలోని కిరాణా షాపులో దూరి, క్యాష్ కౌంటర్ పగలగొడుతుండగా శబ్దాలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. బయట ఓ వ్యక్తి సంచరిస్తుండగా స్థానికులను గమనించిన సదరు దొంగ పారిపోయాడు. వెంటనే లోపల ఉన్న దొంగను పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్