పిడుగురాళ్ల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

59చూసినవారు
పిడుగురాళ్ల సమీపంలోని హైవే రోడ్డు లెనిన్ నగర్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అతివేగంగా వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి గాయాలై రోడ్డుపై పడి ఉన్నాడు. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్