ప్రముఖ పత్రిక సంస్థల అధినేత రామోజీరావు శనివారం తెల్లవారుజామున మరణించారు. ఈ నేపథ్యంలో గురజాల పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శనివారం రాత్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మండలంలోని జర్నలిస్టులు రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్ జోహార్ రామోజీరావు అంటూ నినాదాలు చేశారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.