సైకిల్ గుర్తు పై ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడండి : యరపతినేని

590చూసినవారు
మాచవరం మండలం మాచవరం గ్రామంలో గురజాల నియోజకవర్గ ఉమ్మడి కూటమి అసెంబ్లీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మొదటగా మాచవరం గ్రామం నందు గ్రామంలో వేచివున్న ప్రజలకు అభివాదం చేస్తూ ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గురజాల నియోజకవర్గ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి యరపతినేని ని, నరసరావుపేట ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ని గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని సైకిల్ గుర్తు పై ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ప్రజలందరిని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాచవరం మండలం కన్వినర్ బడిగుంచల వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు, మాచవరం మాజీ మండలం కన్వినర్ యడ్లపల్లి రామారావు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ యారాసి వెంకట్రావు, జనసేన మండల పార్టీ కన్వీనర్ బొమ్మ శ్రీనివాసరావు, గ్రామంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మాచవరం మండలంలోని వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్