పంట సాగు చేసే కౌలు రైతులకు గుర్తింపు కార్డు అందజేస్తాం

53చూసినవారు
పంట సాగు చేసే కౌలు రైతులకు గుర్తింపు కార్డు అందజేస్తాం
పంట సాగు చేసే ప్రతి ఒక్క కౌలు రైతుకు గుర్తింపు కార్డు అందజేస్తామని అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారి మణిదీప్తి అన్నారు. మాచవరం మండలం మొర్జంపాడు గ్రామ రైతు భరోసా కేంద్రంలో శనివారం కౌలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు తమ పొలం యజమాని పాస్ పుస్తకం జిరాక్స్, కౌలు రైతు ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబరును జత చేసి మీ గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రం, రెవిన్యూ ఆఫీసులో అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్