పిడుగురాళ్ల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి జరిగిన సమీక్షా సమావేశంలో మేధావులు, వ్యాపారులు, ప్రజలతో చర్చించారు. రానున్న నాలుగేళ్లలో కూటమి ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి పనులు చేపడతామని, అందరి సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.