చెరువులో కాలుజారిపడి ఒక వ్యక్తి మృతి

59చూసినవారు
చెరువులో కాలుజారిపడి ఒక వ్యక్తి మృతి
మాచర్ల మండల పరిధిలోని పశువేముల గ్రామంలో గల సూరమ్మ చెరువు నందు పశువులను మేపుకుంటూ వెళ్లిన వ్యక్తి శనివారం చెరువు వద్ద కాలుజారి పడిపోయాడు. ఈ ఘటనలో గడ్డం శ్రీనివాసరావు(40) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్