దుర్గి: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరు చోరీ

83చూసినవారు
దుర్గి: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరు చోరీ
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరు చోరీ జరిగిన సంఘటన దుర్గి మండలంలోని ఓబులేశునిపల్లె గ్రామ శివారులో చోటుచేసుకుంది. రైతులు బాల్నీడి కిషోర్, ఆరికట్ల వెంకటేశ్వర్లు పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి రెండు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైరు దొంగిలించారు. బాధిత రైతులు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుధీర్ కూమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్