కేంద్ర ప్రభుత్వ పథకం జలజీవన్ మిషన్ ద్వారా మాచర్ల నియోజకవర్గ ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి రూ. 600కోట్లు కేటాయించడం హర్షణీయమని గురువారం ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. 8 నెలల్లోనే ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించే దిశగా అడుగులు పడుతున్నాయంటే దాని వెనుక నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ముఖ్యమంత్రి చంద్రబాబుకృషి ఎంతో ఉందన్నారు.