గుంటూరు: అటవీ ప్రాంతంలో 700 బెల్లం ఊట,15 లీటర్ల సారా సీజ్

78చూసినవారు
గుంటూరు: అటవీ ప్రాంతంలో 700 బెల్లం ఊట,15 లీటర్ల సారా సీజ్
ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ గుంటూరు, ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మాచర్ల , ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఓఎస్ పీఎఫ్ నరసరావుపేట తమ సిబ్బందితో కలిసి బుధవారం ఉదయం తెల్లవారుజామున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని కొత్తపుల్లారెడ్డి గూడెం గ్రామ అటవీ ప్రాంతములో నాటు సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించారు. 700 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 15 లీటర్ల నాటు సారాని సీజ్ చేశారు. ఈ కేసులో ముద్దాయిలను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్