ప్రతి విద్యార్థి జీవితంలో గురువులతో సాగే సాంగత్యం పూర్వజన్మ సుకృతమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ నందు జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్రలతో కలసి, ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గురువులతో నాడు గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు.