కారంపూడి: రోడ్డు ప్రమాదంలో.. వ్యక్తికి తీవ్ర గాయాలు

6చూసినవారు
కారంపూడి మండలంలోని సన్నీగండ్ల ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆదివారం ఆటో అదుపుతప్పి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు పిడుగురాళ్ల మండలం గుత్తికొండ బిలం వెళ్లి. దైవ దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. అటుగా వస్తున్న కారంపూడి సర్కిల్ సీఐ టీ. వీ శ్రీనివాసరావు గమనించి వెంటనే వారిని రక్షించి అంబులెన్స్ లో పిడుగురాళ్ల ప్రెవేట్ హాస్పిటల్ కి తరలించారు.

సంబంధిత పోస్ట్