కారంపూడి మండల పరిధిలోని మిరియాల గ్రామంలో కొలువుదీరిన శ్రీ ఆవుదేవర అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సతీసమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు అనంతరం ఆలయ వేద పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు. ముందుగా మిరియాల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి బ్రహ్మారెడ్డికి ఘన స్వాగతం పలికారు.