పట్టపగలు ఓ ఫాన్సీ షాపులో చోరీ జరిగిన ఘటన కారంపూడి పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. షాపులో ఎవరూ లేని సమయం చూసి రూ. 1, 55000లను చోరీ చేసినట్లు షాప్ యజమాని మురళి తెలిపారు. షాప్ యజమాని మురళి మాట్లాడుతూ ఓ బ్యాంకులో గోల్డ్ లోన్ కట్టడానికి డబ్బు మొత్తాన్ని లాకర్ లో పెట్టి భోజనానికి వెళ్లి వచ్చేసరికి చోరీ జరిగిందని బాధితుడు వెల్లడించాడు. కారంపూడి ఎస్సై వాసు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.