మాచర్ల నుంచి గుంటూరుకు నూతన బస్ సర్వీసులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు డిపో మేనేజర్ వీరాస్వామి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వం నూతన బస్ సర్వీసులను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. మాచర్ల నుంచి బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్ సర్వీసులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.