డిసెంబర్ నెల ఒకటో తేదీన పంపిణీ చేయవలసిన సామాజిక పింఛన్లు ఈనెల 30 తేదీనే పంపిణీ చేయనున్నట్లు మాచర్ల ఎంపీడీవో శుక్రవారం ఆర్. ఫణి కుమార్ తెలిపారు. డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. తిరిగి డిసెంబర్ రెండో తేదీ సోమవారం పింఛన్లు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.