2025లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 6 లోపు అర్హత గల పట్టభద్రులందరూ ఓటును త్వరగా నమోదు చేసుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం తమ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేపటితో చివరి రోజు సమయం ఆసన్నమైందన్నారు. పట్టభద్రులకు సూచనలు ఇచ్చేందుకు తమ కార్యాలయ సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు.