ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం మాచర్ల పట్టణంలోని ఎస్ కే బి ఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో 70 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు జిల్లా నైపుణ్యాధికారి తమ్మాజీరావు తెలిపారు. జాబ్ మేళాకు 5 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారన్నారు. 118 మంది నిరుద్యోగులను ఇంటర్వ్యూలు నిర్వహించి 70 మందిని ఉద్యోగాలకు ఆయా ప్రజలు ఎంపిక చేసుకున్నారని వివరించారు.