అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మాచర్ల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే తన కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలకు అలవికాని హామీలను ఇచ్చి వాటిని అమలు చేయలేక, వాటి గురించి ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేయటం మానుకోవాలని అన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.