మాచర్లలో ఫ్యాక్షన్ కోరల్లో అణచివేతకు గురై. , ప్రాణ భయంతో ఆత్మకూరు గ్రామం వదలివెళ్లిన ఎస్సీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్కున చేర్చుకున్నారు. మాచర్ల నియోకవర్గం దుర్గి మండలం, ఆత్మకూరు గ్రామంలో చెందిన 127 మంది ఎస్సీలు శాసన సభ్యులు జూలకంటి సారధ్యంలో ఆదివారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటానంటూ ముఖ్యమంత్రి భరోసా కలిగించారు.