మాచర్ల: రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు పెడుతోంది
కూటమి ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు పెడుతోందని మాచర్ల శాసన సభ్యుల జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో సాధించిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ మాచర్ల అంబేద్కర్ సెంటర్ లో గురువారం టీడీపీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.