మాచర్ల నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 117. 75 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంగళవారం మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా నిధులు మంజూరు చేసినట్లు బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. గత వైసిపి హయాంలో రహదారులు అద్వానంగా మారాయి అని అయన అన్నారు.