మాచర్ల: రైతుల పంటల్లో సిరులు పండాలి: ఎమ్యెల్యే

82చూసినవారు
మాచర్ల: రైతుల పంటల్లో సిరులు పండాలి: ఎమ్యెల్యే
రైతుల పంటల్లో సిరులు పండాలనిమాచర్ల ఎమ్యెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. బుధవారం మాచర్ల మండలం అలుగురాజు పల్లి గ్రామంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో మాచర్ల ఎమ్యెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్యెల్యే బ్రహ్మారెడ్డి నాగలి చేతబట్టి పొలంలో అరక దున్నారు. అనంతరం ఎమ్యెల్యే మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగా కురిసి రైతుల పంటల్లో సిరులు పండాలన్నారు.

సంబంధిత పోస్ట్