ఆరోగ్యం ఒక సంపద, అది ఉంటేనే మహాభాగ్యమని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. వెనకబడ్డ పల్నాడు ప్రాంతంలో పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిచుటకు కార్పోరేట్ హాస్పటల్స్ సైతం ముందుకు రావాలని ఆయన కోరారు. సీజనల్ అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామీణ స్ధాయిలోనే అధికారులు వాటిని అరికట్టాలని సూచించారు. ఉచిత వైద్య శిబిరాన్నిఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.