మాచర్ల: కృష్ణమ్మ పరవళ్లు.. సాగర్ కు పెరుగుతున్న నీటిమట్టం

1589చూసినవారు
మాచర్ల: కృష్ణమ్మ పరవళ్లు.. సాగర్ కు పెరుగుతున్న నీటిమట్టం
నాగార్జునసాగర్ డ్యామ్ కు నీటిప్రవాహం పెరుగుతోంది. ఎగువున జూరాల నిండి దిగువున శ్రీశైలానికి నీటిని విడుదల చేయడంతో సాగర్ జలాశయం జలకళ సంతరించుకుంది. ప్రతిరోజు సుమారు 67వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ఆయకట్టుకు ఈఏడాది ముందుగానే నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 524. 70 అడుగులకు చేరింది.

సంబంధిత పోస్ట్