విజయవాడ ప్రెస్ క్లబ్లో అక్టోబర్ 31న జరగనున్న పీడిత ప్రజల పక్షపాతి కామ్రేడ్ జి.ఎన్. సాయిబాబా సంస్మరణ సభ విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నేతలు కోరారు. శనివారం పిడుగురాళ్ల పిల్లుట్ల రోడ్లో ఈ సభకు సంబంధించిన కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు.వారు మాట్లాడుతూ, ప్రజాస్వామికంగా ప్రశ్నించడాన్ని ప్రభుత్వం నేరంగా భావించి, 90% అంగవైకల్యం ఉన్న సాయిబాబాను అన్యాయంగా పదేళ్ల పాటు ఒంటరి అండా సెల్లో నిర్బంధించిందని పేర్కొన్నారు.