మాచర్లలో గురువారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నీలంరాజు (44) ఓ కళ్యాణ మండపంలో డెకరేషన్ పనులు చేస్తూ ఉంటాడు. డెకరేషన్ పరికరాలను లారీపై తెస్తుండగా 11కె. వి విద్యుత్ తీగలకు ఇనుప గొట్టాలు తగిలాయి. లారీలో ఉన్న ఇద్దరిని బయటకు లాగగా అప్పటికే నీలం రాజు ప్రాణాలు విడిచాడని స్థానికులు తెలిపారు.