మాచర్ల: పంచాయితీ ఏర్పాటుపై గ్రామస్తులతో సమావేశం

69చూసినవారు
మాచర్ల: పంచాయితీ ఏర్పాటుపై గ్రామస్తులతో సమావేశం
మాచర్ల మండలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో అంతర్భాగమైన విజయపురిసౌత్ ను నూతన పంచాయతీగా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అధికారులు గ్రామస్తులతో బుధవారం సమావేశం అయ్యారు. పంచాయతీ ఏర్పాటుతో జరిగే అభివృద్ధి గురించి గ్రామస్తులకు అధికారులు తెలియజేశారు. అలాగే స్థానిక ఎన్నికలు నిర్వహణ, విద్యుత్, ఇంటి స్థలాలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ అభిప్రాయాలను అధికారుల ఎదుట వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్