సర్వర్ణాంధ్రప్రదేశ్ – 2047 లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా అధికారులు పని చేయాలని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. శనివారం మాచర్ల పట్టణంలోని కేసీపీ అతిధి గృహంలో నియోజకవర్గ స్థాయి అధికారులలో నియోజకవర్గ అభివృద్ధి కార్యచరణ ప్రణాళికలపై ఎమ్మెల్యే సమీక్షించారు. అలానే అభివృద్ధి విషయంలో పరిశ్రమల పాత్రపై శ్రీ, పరాశక్తి, కేసీపీ, చక్ర సిమెంట్స్ సిబ్బందితో చర్చించారు.