మాచర్ల: రామప్ప ఆలయంలో ఎమ్మెల్యే జూలకంటి విశేష పూజలు

67చూసినవారు
మాచర్ల: రామప్ప ఆలయంలో ఎమ్మెల్యే జూలకంటి విశేష పూజలు
జమ్మలమడక రోడ్డులోని చింతల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దంపతులు శనివారం విశేష పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన జూలకంటి దంపతులను వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చింతల రామలింగేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు గొలుసుతో కూడిన మంగళ సూత్రాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్