ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు చేపట్టనున్నట్లు మాచర్ల తహశీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం మాచర్ల మండలం విజయపురిసౌత్లోని గ్లోరి క్రెస్టు చర్చి ఎదురుగా కబ్జాకు గురైన ఇరిగేషన్ భూమిని ఆయన పరిశీలించారు. నాగులవరంకి చెందిన వైసీపీ నాయకుడు బూడిద శ్రీను ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లు వేసి విక్రయాలు జరిపినట్లు ఇరిగేషన్, రెవిన్యూ అధికారుల పరిశీలనలో నిర్ధారణ అయినట్లు తహశీల్దార్ తెలిపారు.