మాచర్ల: మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొండి

61చూసినవారు
మాచర్ల: మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొండి
కారంపూడి మండల కేంద్రంలో ఉన్న బ్రహ్మానాయుడు జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో, ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించనున్నారు. పిడుగురాళ్లకు చెందిన ఉన్నం హాస్పిటల్స్, ఆర్క్ హాస్పిటల్, గుంటూరు వారి సహకారంతో ఈ శిబిరం జరుగుతుంది. శిబిరాన్ని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రారంభించనున్నారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు.

సంబంధిత పోస్ట్