కూటమి ప్రభుత్వంలోనే విద్యార్థులకు మేలు చేకూరుతుందని టీడీపీ మాచర్ల మండలం, విజయపురిసౌత్ అధ్యక్షుడు బొల్లా వెంకటేశ్వర్లు చౌదరి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టీడీపీ నేతలు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొల్లా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్య కోసం ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం భరిస్తుందన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందన్నారు.