పల్నాడు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్‌ను హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్ట్ చేసి గురువారం మాచర్ల కోర్టులో హాజరుపరిచారు. చల్లా శివకుమార్‌పై హత్యాయత్నం కేసులో విచారణ అనంతరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం కిషోర్‌ను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.