మాచర్ల: సమాజం నుంచి సాక్షిని సాగనంపాలి

67చూసినవారు
మాచర్ల: సమాజం నుంచి సాక్షిని సాగనంపాలి
సమాజం నుంచి జగన్ రెడ్డి అవినీతి మీడియా సాక్షిని సాగనంపాలని మాచర్ల పట్టణ మహిళలు మంగళవారం కదంతొక్కారు. సాక్షి చానెల్లో ఏపీ రాజధాని పట్ల, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన జర్నలిస్టులను, అలా మాట్లాడించిన యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని పట్టణంలో భారీ నిరసన ర్యాలీ తీశారు. వడ్డె ఓబన్న సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు సాగిన ఈ నిరసన ర్యాలీలో కూటమి పార్టీల మహిళా నేతలు, స్వచ్ఛంధ సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినదించారు.

సంబంధిత పోస్ట్