మాచర్ల మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో మాచర్ల న్యాయస్థాన ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో మొత్తం 247 కేసులు పరిష్కరించారు. అందులో సివిల్ 12, బ్యాంక్ 8, ఈ.పి 18, క్రిమినల్ 63, ఎక్సేంజ్ 15, చెక్ బౌన్స్ 7, ఎస్‌టీసీ 117, పిఎల్డబ్ల్యు 7 కేసులు ఉన్నాయి. ప్రధాన సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ బెంచ్ సభ్యులుగా వ్యవహరించారు.