మాచర్ల మండలం, విజయపురిసౌత్ స్థానిక నాగార్జున పిరమిడ్ ధ్యాన మందిరం, శ్రీ రుక్మిణీ సమేత శ్రీ కృష్ణ భగవాన్ సభ్యుల ఆధ్వర్యంలో అహింసా శాకాహార ర్యాలీ ని మంగళవారం చేపట్టారు. సభ్యులు ఫ్లగ్ కార్డులు చేతబట్టుకొని జీవ హింస చేయరాదంటూ నినాదాలు చేస్తూ కృష్ణవేణి పుష్కర్ ఘాట్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయపురిసౌత్ ఎస్ ఐ షేక్ మహమ్మద్ షఫీ పాల్గొని మాట్లాడారు.