అభివృద్ధి కాముకుడైనా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులను మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించడం విడ్డూరంగా ఉందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. శనివారం మాచర్ల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు అభివృద్ధికి ఎంపీ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి, అహర్నిశలు పాటుపడుతున్నారు. ఆయనపై విష ప్రచారం చేస్తున్నారు.