ప్రకాశం: శ్రీ బాలా త్రిపుర సుందరి దేవికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

78చూసినవారు
ప్రకాశం: శ్రీ బాలా త్రిపుర సుందరి దేవికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
త్రిపురాంతకంలో కొలువుతీరిన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. గర్భాలయంలో ప్రతిష్ఠించిన శక్తివంతమైన అమ్మవారి శ్రీ చక్రానికి కుంకుమార్చన, విశేష పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కొండపైన కొలువుతీరిన శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారిని దర్శించుకొని, విశేషాభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్